బాలికపై అత్యాచారం.. పదేళ్ల జైలు

బాలికపై అత్యాచారం.. పదేళ్ల జైలు

GDWL: ప్రేమ పేరుతో ఓ మైనర్ పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి పదేళ్ల జైలు విధిస్తూ MBNR ప్రిన్సిపల్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి రాజేశ్వరి తీర్పు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. జైలుశిక్షతో పాటు రూ.పదివేలు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. 2018లో భూత్పూర్ (M)కు చెందిన యాదయ్య 16ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు.