ముధోల్‌లో ప్రొటోకాల్ రగడ.. ఎమ్మెల్యే ఆగ్రహం
NRML: ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మీడియా సమావేశంలో సర్పంచ్‌ల వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రోటోకాల్‌ను పాటించకుండా ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేల చేత ప్రొసిడింగ్స్ తీసుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతులను గౌరవించాలని సూచించారు. అభివృద్ధి పనులకు తాను ఎప్పుడూ మద్దతు ఇస్తానని తెలిపారు.