సీతారామపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
NLR: సీతారామపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం మాజీ జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు మందుల నిల్వలను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలు గురించి ఆరా తీశారు. ప్రతిరోజు ఓపీకి వచ్చిన వారి సంఖ్యను పరిశీలించారు. వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి, వైద్యం చేయాలని సూచించారు.