సరైన డాక్యుమెంట్స్ లేని 13 ఆటోలు సీజ్
ప్రకాశం: పామూరు పట్టణంలో CI మాకినేని శ్రీనివాసరావు ఎలక్ట్రిక్ ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన డాక్యుమెంట్స్ లేని 13 ఆటోలను సీఐ సీజ్ చేసి , పోలీస్ స్టేషన్ కు తరలించారు . సరైన డాక్యుమెంట్స్ లేనందున జరిమానాలు విధించారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా అన్ని రకాల డాక్యుమెంట్స్ తమ వద్ద ఉంచుకోవాలని సీఐ సూచించారు.