'గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి'

ప్రకాశం: వెలిగండ్ల మండలంలో సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీపీ రామన మహాలక్ష్మమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో మౌలిక వసతుల రూపకల్పనకు కార్యచరణ రూపొందించాలని.. ఎంపీడీవో మహబూబ్ బాషాకు తెలిపారు. వర్షాల నేపథ్యంలో గ్రామాలలో అన్ని పంచాయతీలలో బ్లీచింగ్ వెదజల్లాలని ఆమె తెలిపారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.