మీడియా పట్ల అపారమైన గౌరవం ఉంది: ఎమ్మెల్యే

మీడియా పట్ల అపారమైన గౌరవం ఉంది: ఎమ్మెల్యే

MNCL: మంచిర్యాల నియోజకవర్గంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పట్ల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. నియోజకవర్గంలో శక్తి వంచన లేకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా మీడియాలో కవరేజ్ తక్కువగా ఉందనే బాధతోనే ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్నారు. మీడియా పట్ల అపారమైన గౌరవం ఉందన్నారు.