VIDEO: మంత్రిపై దాడి కేసులో ముగ్గురు BRS నాయకుల అరెస్ట్
MNCL: క్యాతన్ పల్లిలో ఫిబ్రవరి 16న మంత్రి వివేక్ వెంకటస్వామిపై జరిగిన దాడి కేసులో ముగ్గురు BRS నాయకులను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న బండారి సూరిబాబు, మేడిపల్లి సంపత్, ఎండి ముస్తఫాలను ఆదివారం తెల్లవారుజామున రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ తరలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.