కారులో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

KMM: సింగరేణి మండలంలోని మోట్లగూడెంలో గడపర్తి శ్రీను చౌదరి అనే రైతు ఆర్థిక లావాదేవీల మనోవేదనతో తన పొలం వద్దకు వెళ్లి, కారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని బంధువులు తెలిపారు.