జిల్లాలోని SC యువతకు శుభవార్త..!
MLG: జిల్లాలోని షెడ్యూల్ కులాల యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అర్హత గల యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు. జిల్లాలోని అర్హత గల యువత ఇవాళ నుంచి 23 వరకు https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.