చీరాలలో శక్తి టీం అవగాహన కార్యక్రమం

చీరాలలో శక్తి టీం అవగాహన కార్యక్రమం

BPT: పదో తరగతి పరీక్షలు ముగిసిన సందర్భంగా విద్యార్థులకు శక్తి టీం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. శక్తి యాప్ ఉపయోగాలు, హెల్ప్‌లైన్ నంబర్లు (112, 1098, 181), సైబర్ క్రైమ్స్, రోడ్డు భద్రతపై వివరించారు.18 సంవత్సరాలు పూర్తైనవారు లైసెన్స్ తీసుకోవాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమాదాలపై కూడా అవగాహన కల్పించారు.