రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మొండికుంట గ్రామ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేగంగా వస్తున్న కారు లారీని ఢీకొనడంతో ప్రమాదం సంభవించిందని అన్నారు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయని 108 కు సమాచారం అందించి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.