ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
BDK: జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఆయన ఆసుపత్రి పరిసరాలను, విభాగాల పనితీరును సమగ్రంగా పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వడదెబ్బ కేసులు ఎక్కువగా నమెదవుతన్నట్లు గుర్తించి కేంద్రంలో అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్థంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.