'బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలి'
ATP: విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేస్తున్న 'జీపు జాత' కార్యక్రమం ఇవాళ ఆత్మకూరు మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సమస్యల గురించి ఆరా తీశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు పరమేష్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలకు అనుబంధంగా బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.