మన గ్రోమోర్ వద్ద రైతులతో ముచ్చటించిన సీఎం
KDP: జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్బంగా పెండ్లిమర్రిలో ముందుగా పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే వెల్లటూరులోని మన గ్రోమోర్ ఎరువుల షాప్‌ను ప్రారంభించి, రైతులతో కొంత సేపు ముచ్చటించారు. అనంతరం వారికి కావాలసిన సహాయం చేస్తానని హామి ఇచ్చినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తరుపున ప్రజలకు ఏప్పుడు అండగా నిలబడతానని తెలిపారు.