భక్తిశ్రద్ధలతో షబే బరాత్‌ను జరుపుకున్న ముస్లింలు

CTR: షబాన్ (షబే బరాత్) పండగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం రాత్రి పుంగనూరులోని మసీదుల్లో ప్రత్యేక నమాజ్‌లు చేపట్టారు. ఈ సందర్భంగా షబే బరాత్ పండుగ ప్రాముఖ్యతను మత పెద్దలు వివరించారు. అనంతరం కబరస్థాన్‌కు చేరుకొని మృతి చెందిన తమ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేశారు.