భద్రాద్రి జిల్లా ప్రజలకు అండగా ఉంటాం: మాజీ ఎమ్మెల్యే

భద్రాద్రి జిల్లా ప్రజలకు అండగా ఉంటాం: మాజీ ఎమ్మెల్యే

BDK: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వరద ప్రభావిత ప్రాంతాల్లో త్రాగునీరు, పాలు, ఆహారం అందించాలని జిల్లా అధ్యక్షులు & మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించుకోవాలని సూచించారు. అవసరమైనచోట ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.