'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

GNTR: ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతుండటంతో దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి సుమారు 6 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో కొల్లిపర మండలంలోని కృష్ణానది పరివాహక ప్రాంత లంక గ్రామాల ప్రజలు మరోసారి వరద ముప్పు పొంచి ఉందనే భయంతో ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.