కార్పొరేటర్ చొరవతో వరద నీరు తొలగింపు

కార్పొరేటర్ చొరవతో వరద నీరు తొలగింపు

KMM: ఖమ్మం రాపర్తి నగర్ బైపాస్ రోడ్‌లోని HP పెట్రోల్ బంకు వద్ద బుధవారం భారీ వర్షానికి వరద నీరు రోడ్డుపై చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సమాచారం తెలుసుకున్న కార్పొరేటర్ రాపర్తి శరత్ కుమార్ రోడ్డుపై వరద నీరు చేరిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి రెండు JCBల సహాయంతో వరద నీటిని దిగువకు వెళ్లే విధంగా చేశారు.