'రైట్ టు డిస్‌కనెక్ట్' అంటే ఏమిటంటే?
'రైట్ టు డిస్‌కనెక్ట్' అంటే పనివేళలు పూర్తయిన తర్వాత ఆఫీసు నుంచి వచ్చే కాల్స్, ఈ-మెయిల్‌లను స్వీకరించకుండా ఉండే హక్కు. దీనిని మొదటగా 2017లో ఫ్రాన్స్ చట్టం చేయగా.. తర్వాత స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, బెల్జియం వంటి దేశాలు చేశాయి. దీని ఉద్దేశ్యం వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మానసిక ఆరోగ్యం. భారత్‌లో 2018, 2025లో అమలు చేసినా బిల్లులు ఇప్పటివరకు చట్టం కాలేదు.