రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు
TG: తీవ్రమైన ఎండతో రాష్ట్రం ఉడికిపోయింది. ప్రధానంగా 7 జిల్లాల్లోని 20 మండలాలు సలసలా కాగిపోయాయి. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్.. ఆదిలాబాద్ అర్బన్, నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలాల్లో 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. రేపు ఒకటి నుంచి 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.