జనాలపైకి దూసుకెళ్లిన బస్సు.. నాలుగేళ్ల బాలుడు మృతి
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సిన్నార్ బస్టాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాట్‌ఫామ్‌పై నిల్చున్న ప్రయాణికుల మీదకి ఆర్టీసీ బస్సు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందగా, మరో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆర్టీసీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బస్టాండ్‌లో భయాందోళన నెలకొంది.