పాఠశాలకు షోకాజ్ నోటీసు

పాఠశాలకు షోకాజ్ నోటీసు

గుంటూరు సంగడిగుంటలోని శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలు 1వ తరగతి విద్యార్థిని చెంపలపై కొట్టిందన్న ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మండల విద్యా అధికారి (గుంటూరు తూర్పు) షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఘటనపై పూర్తి వివరణను ఒక రోజు లోపు సమర్పించాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.