ఇసుక కోసం దరఖాస్తు చేయండి: తహశీల్దార్

ఇసుక కోసం దరఖాస్తు చేయండి: తహశీల్దార్

NGKL: పెద్దకొత్తపల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టుతున్న లబ్ధిదారులు ఇసుక కోసం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తహశీల్దార్ శ్రీనివాసులు సూచించారు. ప్రభుత్వం ద్వారా నాణ్యమైన ఇసుకను సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను సమయానికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.