దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న కలెక్టర్
GDWL: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 3వ తేదీన జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఉదయం 11 గంటలకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సోమవారం కలెక్టర్ సంతోష్ తెలపారు. ఆ రోజు వివిధ శాఖలచే ప్రతిపాదించబడిన దివ్యాంగ ఉద్యోగులను సత్కరించటం జరుగుతుందని పేర్కొన్నారు.