VIDEO: కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ధర్నా
SKLM: కలెక్టరేట్ వద్ద సీఐటియు జిల్లా అధ్యక్షుడు సి.హెచ్. అమ్మన్నాయుడు ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేడు మహా ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఎఫ్.ఆర్.ఎస్ విధానాన్ని రద్దు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.