చిలుకూరులో ‘డబుల్’ ఓట్లు… విచారణకు డిమాండ్
SRPT: చిలుకూరు మండలం జానకి నగర్ గ్రామ పంచాయతీలో ఓటర్ల జాబితాలో వెలుగులోకి వచ్చిన డబుల్ ఎంట్రీలు కలకలం రేపుతున్నాయి. 6వ వార్డులో అదే మహిళ పేరుతో 514,518 సీరియల్ నంబర్ల వద్ద రెండు ఓట్లు నమోదైనట్టు గుర్తించారు. పేరు ఒకటే కాగా.. ఇంటి పేరు, భర్త పేరు మాత్రం భిన్నంగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. వెంటనే సంబంధిత అధికారులు విచారణ చేపట్టాలని గ్రామస్తులు వాపోయారు.