లడ్డూలు పంచిన షబ్బీర్ అలీ

KMR: వినాయకుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మంగళవారం వినాయక మండపాల కోసం తయారు చేయించిన లడ్డూలను కామారెడ్డిలొ పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రతిష్ఠించిన ప్రతి వినాయక మండపానికి లడ్డూలను పంపిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేశ్ షెట్కార్ పాల్గొన్నారు.