రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ రద్దు

రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ రద్దు

చిత్తూరు: కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. పలు అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలెవరూ కలెక్టర్ కార్యాలయానికి రావద్దని సూచించారు.