జూదగాళ్ల కదలికలపై పోలీసుల కన్ను
NLG: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పేకాట రాయుళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు హాలియా, సాగర్ మున్సిపాలిటీలతో పాటు తిరుమలగిరి, నిడమనూరు, పెద్దవూర మండలాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సుమారు 150 మంది పాత జూదగాళ్లను గుర్తించి, వారికి పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్ నిర్వహించారు.