ఉపాధ్యాయుడి బదిలీపై విద్యార్థుల అందోళన

JN: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు శనివారం ఆందోళన నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అనుగుణంగా ఉంటూ చక్కటి విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్ పై బదిలీ చేయడాన్ని నిరసిస్తూ పాఠశాల ఎదుట ధర్నా చేస్తున్నారు. తమ ఉపాధ్యాయుడిని తిరిగి పాఠశాలకు కేటాయిస్తేనే ఆందోళన విరవిస్తామని విద్యార్థులు హెచ్చరించారు.