స్వాతంత్రం తీసుకురావడంలో సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర

JGL: స్వాతంత్య్రం తీసుకురావడంలో సుభాష్ చంద్రబోస్ కీలకపాత్ర వహించారని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశం కోసం నేతాజీ చేసిన సేవలు మరువలేమన్నారు.