సైబర్ నేరాలపై గ్రామస్థులకు ఎస్సై అవగాహన
ATP: పెద్దవడగూరు మండలం చిట్టూరు, దిమ్మగుడి గ్రామాల్లో మంగళవారం ఎస్సై పి.ఆంజనేయులు గ్రామసభలు నిర్వహించారు. ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. నకిలీ లోన్ యాప్స్, అనుమానాస్పద లింకులు, ఓటీపీలను ఇతరులకు చెప్పడం వల్ల కలిగే నష్టాలను వివరించారు.