తురకపాలెంలో వరుస మరణాలపై ఎమ్మెల్యే పర్యటన

తురకపాలెంలో వరుస మరణాలపై ఎమ్మెల్యే పర్యటన

GNTR: తురకపాలెంలో జరుగుతున్న వరుస మరణాలపై గురువారం ఎమ్మెల్యే రామాంజనేయులు గ్రామంలో పర్యటించి పరిశీలించారు. ఇంటింటికీ తిరిగి ప్రజలను కలిసి మరణాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వరుస మరణాలపై వైద్య బృందంతో చర్చించి, తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.