చరణ్, సుకుమార్ మూవీ హీరోయిన్ ఫిక్స్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబోలో మరో ప్రాజెక్టు రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మను తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. చరణ్‌కు జోడీగా ఆమె అయితే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.