రామప్పను సందర్శించిన యునెస్కో అంబాసిడర్

రామప్పను సందర్శించిన యునెస్కో అంబాసిడర్

MLG: ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని యునెస్కో భారత దేశ శాశ్వత ప్రతినిధి విశాల్ వి. శర్మ సందర్శించారు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన రామప్పకు వచ్చారు. ఆలయ పరిరక్షణ, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన వెంట ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు దేశాయ్, కృష్ణ చైతన్య, రోహిణి, నాగోజీ రావు ఉన్నారు.