చెరువులో చేప పిల్లలు విడుదల చేసిన కలెక్టర్

చెరువులో చేప పిల్లలు విడుదల చేసిన కలెక్టర్

NRML: మత్స్యకారులు మత్స్య సంపద పెంపుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ మండలం డ్యాంగాపూర్ గ్రామంలోని చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మత్స్యకారులు మత్స్య సంపద వల్ల ఆర్థికంగా బలపడవచ్చని అన్నారు. విడుదల చేసిన చేప పిల్లలు, సరైన సైజుకు రాగానే, చేపలను పట్టి ఆర్థికంగా బలవపేతం సాధించాలని సూచించారు.