తల్లి పాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం

చిత్తూరు: మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే శిశువుకు సంపూర్ణ ఆహారమని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వెంకమరాజు పేర్కొన్నారు. సోమవారం విజయపురం మండలం శ్రీహరిపురం అంగన్వాడి కేంద్రం నందు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. తల్లిపాలు పిల్లల మేధస్సును మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆరోగ్య కార్యకర్త చందన పేర్కొన్నారు. అంగన్వాడి కార్యకర్తలు సుజాత, విజయ పాల్గొన్నారు.