తొండూరులో రెచ్చిపోయిన దొంగలు

తొండూరులో రెచ్చిపోయిన దొంగలు

KDP: తొండూరు మండలం మడూరు-దొండ్లవాగు మధ్య గురువారం దొంగలు రెచ్చిపోయారు. మడూరు ఏఎన్ఎంగా పనిచేస్తున్న దీవెనమ్మ వైద్యసేవల అనంతరం దొండ్లవాగుకు వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసును అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణ మద్దిలేటి తెలిపారు.