పూర్తిస్థాయిలో నిండిన నిమ్మపల్లి ప్రాజెక్టు

SRCL: జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని కోనరావుపేట మండలం నిమ్మపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. మరోవైపు మూలవాగు, నక్కవాగు కూడా జలకళ సంతరించుకున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టులను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.