మైలారంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
SDPT: చిన్నకోడూరు మండలంలోని మైలారం గ్రామంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాల మేరకు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. సర్పంచ్ నవుండ్ల సరిత హరీష్, వార్డు సభ్యులు, ఐకేపీ సిబ్బందితో కలిసి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని సౌకర్యాలతో ఈ కేంద్రం కొనసాగుతుందని తెలిపారు.