33 ఏళ్ల లీజుకు 1200 ఎకరాలు

KDP: కడప జిల్లా మైలవరం మండలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు 1200 ఎకరాలను లీజు ప్రాతిపదికను కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దొడియంలో 1105.69 ఎకరాలు, వద్దిరాలలో 94.36 ఎకరాల ప్రభుత్వ భూములను 33 ఏళ్ల లీజుకు ఇచ్చింది. సోలార్ పరిశ్రమతో ఉద్యోగాలు వస్తాయని స్థానికులు ఆశగా ఎదురు చూస్తున్నారు.