48 గంటల్లోనే ఖాతాల్లో ధాన్యం సొమ్ము: ఎమ్మెల్యే గోరంట్ల

48 గంటల్లోనే ఖాతాల్లో ధాన్యం సొమ్ము: ఎమ్మెల్యే గోరంట్ల

E.G: ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. సోమవారం రాజవోలులో జరిగిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.