‘పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం’

KRNL: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉందామని మంగళవారం హోళగుంద గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే రోగాలు రావు అన్నారు. ఇంటి ఆవరణలో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతినెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.