VIDEO: పదో తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: MEO

CTR: 10వ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు MEO చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన MRC కార్యాలయ ఆవరణంలో మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పుంగునూరులో 8 కేంద్రాలలో 758 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే హాల్ టికెట్లను విద్యార్థులకు తమ పాఠశాలల్లో అందిస్తున్నట్లు తెలిపారు.