'మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి'
MDCL: మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని, వారు అన్ని రంగాల్లో ముందుండాలని బీజేపీ ఓబీసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మోయి సుజాత అన్నారు. మచ్చబొల్లారం డివిజన్ తుర్కపల్లి బంధం బస్తీలో ఆమె ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించి మహిళలను శాలువాలతో సత్కరించి బహుమతులు అందజేశారు. డివిజన్ అధ్యక్షుడు అజయ్ రెడ్డి, డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.