పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్
PPM: జిల్లాలోని ప్రభుత్వపాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా పలు పాఠశాలలను, కళాశాలను శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. విద్యాశాఖ చేపట్టిన పలు కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.