పౌర హక్కుల దినోత్సవం
SDPT: పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని రెవెన్యూ అధికారులు, ఏ ఎస్సై రమణ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అనంత సాగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కుమార్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.