వినాయక మండపాలకు పర్మిషన్ తప్పనిసరి: SHO

మేడ్చల్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని SHO భాస్కర్ తెలియజేశారు. ప్రజలందరూ శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. పోలీసులకు సైతం సహకరించాలని సూచించారు. గణనాథులను మండపాలలో ఏర్పాటు చేసేటప్పుడు, ఊరేగింపు చేసే సమయాలలో జాగ్రత్తలు పాటించాలని, ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.