రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో రాణించిన కానిస్టేబుల్

WGL: గత నెల హైదరాబాద్‌లోని ఈసిఐఎల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఓపెన్ అథ్లెటిక్స్ పోటీల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ సాయిరాం ఐదు కిలోమీటర్ల పరుగులో కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ సందర్బంగా పతకాన్ని సాధించిన కానిస్టేబుల్‌ను శుక్రవారం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.