NDA కూటమిలో పదవుల చిచ్చు
పదవుల పంపకాలపై NDA కూటమిలో చిచ్చు రాచుకుంటున్నట్లు తెలుస్తోంది. హోం మంత్రితో పాటు స్పీకర్ పదవుల విషయంలో బీజేపీ, జేడీయూ మధ్య పొత్తు కుదరటం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో హోం శాఖ సీఎం నితీశ్ వద్ద ఉందని దానిని వదులుకునేందుకు జేడీయూ సిద్ధంగా లేదని సమాచారం. కాగా, ఈ నెల 20న బీహార్ సీఎంగా మరోసారి నితీశ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.